© 2026 nimisham.in

దాదాపు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన ఓ భారీ సర్పం అవశేషాలు భారత్లో వెలుగుచూశాయి. ఐఐటీ రూర్కీకి చెందిన పరిశోధకులు గుజరాత్లోని కచ్ జిల్లాలో ఈ శిలాజాలను కనుగొన్నారు.
ఈ ప్రాచీన సర్పం ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా పేరొందిన ‘టైటానోబోవా’ రికార్డును సైతం బద్దలుకొట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మొసలి అనుకుంటే.. మహా సర్పం బయటపడింది2004లో గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న పనంధ్రో బొగ్గు గనిలో తవ్వకాలు జరుపుతుండగా 27 భారీ వెన్నుపూసల శిలాజాలు బయటపడ్డాయి. వాటి భారీ పరిమాణం చూసి, తొలుత అవి ఏదైనా ప్రాచీన మొసలికి చెందినవిగా పరిశోధకులు భావించారు. అయితే, ఐఐటీ రూర్కీకి చెందిన పాలియంటాలజిస్ట్ ప్రొఫెసర్ సునీల్ బాజ్పాయ్, ఆయన బృందంలోని పరిశోధకుడు దేబాజిత్ దత్తా ఈ శిలాజాలపై సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఆధునిక సరీసృపాల ఎముకలతో, ఇతర శిలాజాలతో పోల్చి చూసిన తర్వాత, అవి ఒక ప్రత్యేకమైన, అత్యంత భారీ ప్రాచీన సర్పానికి చెందినవని నిర్ధారించారు.స్కూల్ బస్సు కన్నా పొడవు.. అనకొండలా వేటపరిశోధకుల అంచనా ప్రకారం, ఈ సర్పం పొడవు 10.9 మీటర్ల నుంచి 15.2 మీటర్ల (సుమారు 36 నుంచి 50 అడుగులు) వరకు ఉండేది. అంటే, ఇది ఒక సాధారణ స్కూల్ బస్సు కన్నా పొడవుగా ఉండేదని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీని శరీరం విశాలంగా, స్థూపాకారంలో అత్యంత బలమైన కండరాలతో ఉండేదని తెలిపారు. ఇది వేగంగా కదిలే వేటగాడు కాదని, నేటి అనకొండలు, కొండచిలువల మాదిరిగా నీటిలో లేదా చిత్తడి నేలల్లో పొంచి