© 2026 nimisham.in

బుధ గోచారం వల్ల మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు అందుకునే సూచనలు ఉన్నాయి.
కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. మీ మాటతీరు మధురంగా మారి ఇతరులను ఆకట్టుకుంటుంది. ఫలితంగా సెప్టెంబర్ నెలలో వీరికి అదృష్టం రెట్టింపు అవుతుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి.
బుధుడు మీ కర్మ, ఆదాయ స్థానాల నుండి ప్రయాణించడం వల్ల ఆర్థికంగా చాలా కలిసివస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగి, వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. ఈ నెలలో ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రావు. కుటుంబంలో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది.
ఈ రాశి 2వ, 3వ స్థానాల్లో బుధ సంచారం వల్ల ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ (ట్రాన్స్ఫర్), ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు విజయవంతమైన లాభాలను అందుకుంటారు. మీపై మీకు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అనుకున్నవన్నీ సాధించగలుగుతారు.
ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. సమాజంలోనూ, పని ప్రదేశంలోనూ మీ వాక్చాతుర్యం బాగా పనిచేస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. మీ జీవిత భాగస్వామి కూడా కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు.
సెప్టెంబర్ నెలలో మీకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు వస్తాయి. మనస్సులోని భయాలు, సంకోచాలు తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, విదేశీ వ్యాపారం చేసే వారికి ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది.