© 2026 nimisham.in

హైటెక్ సిటీలో రైళ్ల నిలుపుదల అదనపు చార్జీలు లేని సౌకర్యం చార్లపల్లి నుండి ప్రత్యేక రైళ్లు Hitech City Railway Station: పండుగ సీజన్లలో ప్రయాణికుల తీవ్ర రద్దీని తట్టుకునేందుకు, ఐటీ కారిడార్ వాసులకు...
హైటెక్ సిటీలో రైళ్ల నిలుపుదల అదనపు చార్జీలు లేని సౌకర్యం చార్లపల్లి నుండి ప్రత్యేక రైళ్లు Hitech City Railway Station: పండుగ సీజన్లలో ప్రయాణికుల తీవ్ర రద్దీని తట్టుకునేందుకు, ఐటీ కారిడార్ వాసులకు ప్రయాణ సౌలభ్యం కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లింగంపల్లి, సికింద్రాబాద్ ప్రధాన రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు గాను హైటెక్ సిటీ రైల్వే స్టేషన్(Hitech City Railway Station)లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల తాత్కాలిక నిలుపుదలను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగల సమయంలో ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. Ponnam Prabhakar: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. 700 ప్రత్యేక బస్సులతో ఆర్టీసీ ధమాకా.. మంత్రి పొన్నం కీలక ఆదేశాలు రెండు విడతల్లో స్టాపింగ్స్: అదనపు చార్జీలు లేకుండా మార్పు: నరసాపూర్ - లింగంపల్లి, కాకినాడ టౌన్ - లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీలో స్టాపింగ్‌ను రెండు విడతల్లో పొడిగించారు. మొదటి విడతగా దసరా, దీపావళి రద్దీ కోసం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకు, రెండో విడతగా క్రిస్మస్, సంక్రాంతి కోసం డిసెంబర్ 18 నుంచి జనవరి 19 వరకు ఈ రైళ్లు ఆగుతాయి. లింగంపల్లి నుండి బోర్డింగ్ ఉన్న ప్రయాణికులు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ బోర్డింగ్ పాయింట్‌ను హైటెక్ సిటీకి సులభంగా మార్చుకోవచ్చని సూచించారు. చార్లపల్లి - తిరుచానూర్ ప్రత్యేక రైళ్లు: పండుగ ప్రయాణికులకు ఊరట: మరోవైపు ఆధ్యాత్మిక యాత్రికుల కోసం చార్లపల్లి - తిరుచానూర్ మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 4న చార్లపల్లి నుండి, సెప్టెంబర్ 5న తిరుచానూర్ నుండి ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇవి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి. ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు కలిగిన ఈ రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే శాఖ కోరింది.