© 2026 nimisham.in
Deepa Jewellers IPO: జ్యువెలరీ రంగానికి చెందిన ప్రముఖ సంస్థ దీపా జ్యువెలర్స్ (Deepa Jewellers) పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన వస్తోంది.
సబ్స్క్రిప్షన్ మొదలైన రోజునే ఈ ఐపీఓ కోసం ఎగబడ్డారు. ప్రైమరీ మార్కెట్లో పసిడి వ్యాపార సంస్థలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ ఐపీఓపై ప్రాఫిట్ మేకర్స్, రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రే మార్కెట్లో కూడా ఈ ఐపీఓ షేర్లు మంచి ప్రీమియంతో ట్రేడ్ అవుతూ కనీసం 25 శాతం నుంచి 31 శాతం వరకు లిస్టింగ్ లాభాలను అందించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఐపీఓ కీలక వివరాలుదీపా జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ మొదటి రోజునే మంచి స్పందన లభించింది. 3 రెట్లకు పైగా సబ్స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 3.04 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 2.21 రెట్ల మేర బిడ్లను పొందింది. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఒక్కో షేరుపై రూ.44 నుంచి రూ.55 వరకు ప్రీమియం పలుకుతోంది. దీనికి ఆధారంగా లిస్టింగ్ ధర సుమారు రూ.221 నుంచి రూ.232 మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.459.72 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.250 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తుండగా మిగిలిన రూ.209.72 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయిస్తున్నారు. పరిశ్రమ సగటుతో పోలిస్తే పీఈ రేషియో 13.85 అధిక రిటర్న్ ఆన్ నెట్ వర్త్ 56.45 శాతం, కేవలం 18 రోజుల తక్కువ ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ కంపెనీకి సానుకూల అంశాలుగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. స్వల్పకాలిక లిస్టింగ్ లాభాల కోసం ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు సూచిస్తున్నారు. ప్రైస్ బాండ్: రూ.168- రూ.177 లాట్ సైజ్: 84 షేర్లు (కనీస పెట్టుబడి రూ.14,868) సబ్స్క్రిప్షన్ తేదీలు: సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3 అలాట్మెంట్ తేదీ: సెప్టెంబర్ 4, 2026 పీఈ నిష్పత్తి: 13.85x (పరిశ్రమ సగటు 24x కంటే తక్కువ) FY26 నికర లాభం: రూ.104.79 కోట్లు