© 2026 nimisham.in

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
KPHB Land Auction: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కన్న అత్యధిక ధరలు పలుకుతుండగా ఇక హైదరాబాద్‌లో భూముల ధరలు దేశంలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఒక్క గజం రూ.2.70 లక్షలు పలికింది. కేపీహెచ్‌బీకి సంబంధించిన భూముల వేలంలో భారీ ధరలు పలికాయి. ఆ భూముల ధరలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కేపీహెచ్‌బీ భూములకు మరోసారి వేలం నిర్వహించగా ఈసారి తీవ్ర పోటీ నెలకొనడంతో భారీ ధరలు పలికాయి. మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు అమ్ముడుపోయాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.47.14 కోట్ల మేర ఆదాయం లభించిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ప్రకటించారు. ఎటువంటి వివాదాలు లేని.. అన్ని వసతులతో అభివృద్ధి చెందిన కేపీహెచ్‌బీ ప్రాంతంలో నిర్వహించిన ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది.
హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగం వేలంలో ఓపెన్ ప్లాట్లకు రికార్డు ధరలు వచ్చాయి. కేపీహెచ్‌బీ 7 ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక ప్లాట్‌కు ఒక చదరపు గజం భూమి 2.70 లక్షలకు ధర పలికింది. ఈ వేలానికి సంబంధించి హౌసింగ్ బోర్డు ఆగస్టు 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ ప్లాట్లకు చదరపు గజం కనీస ధరగా రూ.1.60 లక్షలు నిర్దారించింది.
ఈ వేలం పాటలో ఓపెన్ ప్లాట్లను దక్కించుకోడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు (బిడ్డర్లు) పోటీపడ్డారు. వేలంలో చదరపు గజం సగటు ధర సుమారు రూ.1.79 లక్షలు పలికిందని హౌసింగ్ బోర్డు అధికారులు ప్రకటించారు. తాజా బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డ్‌కు సుమారు రూ.47.14 మేర కోట్ల ఆదాయం వచ్చిందని వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ వెల్లడించారు. ఒక ప్లాట్ చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్ముడుపోగా.. మరో ప్లాట్ చదరపు గజం రూ.2.36 లక్షలకు వేలంలో ధర లభించిందని తెలిపారు. మరో రెండు ప్లాట్లు రూ.2.06 లక్షలకు వేలం పాటలో ధర పలికిందని వివరించారు. నగరానికి శివారున ఉన్న కేపీహెచ్‌బీ ప్రాంతంలో భూములు ధరలు భారీగా ఉన్నాయి. ఈ డిమాండ్‌తో ప్రభుత్వం రానున్న రోజుల్లో మరికొన్ని కేపీహెచ్‌బీ ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.