© 2026 nimisham.in

బీర్కూర్: బరంగెడ్గిలో సీసీ రోడ్డు పనులు చేపట్టిన గుత్తేదారుడు గ్రామ పంచాయతీ సిబ్బందిని సంప్రదించకుండా ఇష్టానుసరంగా తాగునీటి పైపులైన్లను సీసీ రోడ్డు కింద వేసి నిర్మిస్తున్నారంటూ సర్పంచి రెంజర్ల...
బీర్కూర్: బరంగెడ్గిలో సీసీ రోడ్డు పనులు చేపట్టిన గుత్తేదారుడు గ్రామ పంచాయతీ సిబ్బందిని సంప్రదించకుండా ఇష్టానుసరంగా తాగునీటి పైపులైన్లను సీసీ రోడ్డు కింద వేసి నిర్మిస్తున్నారంటూ సర్పంచి రెంజర్ల అనిల్, పంచాయతీ కార్యదర్శి గురునాథ్ బుధవారం ఎంపీడీవో శ్రీనిధికి ఫిర్యాదు చేశారు. కామప్ప ఆలయం నుంచి ట్రాక్టర్ డ్రైవర్ల యూనియన్ సంఘం సరఫరా చేసే 70 మీటర్ల తాగునీటి పైపులైన్లు సీసీ రోడ్డు మధ్యలోనే ఉన్నాయని, దీంతో లీకేజీ సమస్య తలెత్తితే పరిష్కరించడం సాధ్యం కాదన్నారు. తాగునీటి పైపులైన్ ఎయిర్వాల్ సైతం సీసీ రోడ్డు మధ్యలోనే ఉండిపోయిందన్నారు. సీసీ రోడ్డు మధ్యలోనే తాగునీటి పైపులైన్లు ఉండిపోవడంతో రోడ్డు పక్క నుంచి కొత్త పైపులైన్లు గుత్తేదారుడితో వేయించేలా చూడాలని సర్పంచి ఎంపీడీవోను కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.