
అయోధ్య రామాలయ తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్ర ఎంపిక
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్‌మార్షల్ జితేంద్ర మిశ్ర ఎంపిక! Ayodhya Ram Mandir: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్య శ్రీరామ మందిరానికి తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నియామకం ఖరారైంది. రామమందిర తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్‌మార్షల్ జితేంద్ర మిశ్ర ఎంపికయ్యారు. భారతీయ వాయుసేనలో దాదాపు 39 ఏళ్లపాటు సుదీర్ఘంగా సేవలు అందించిన జితేంద్ర మిశ్ర, అత్యున్నత రక్షణ రంగ అనుభవాన్ని కలిగి ఉన్నారు. అయోధ్య రామాలయంలో కానుకలు మరియు విరాళాల నిర్వహణపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఈ కీలక పోస్టుకు పారదర్శకతను తీసుకువచ్చేలా నియామక ప్రక్రియను చేపట్టారు. సీఈవో పోస్టు కోసం ఎంపిక కమిటీ అత్యంత కఠినంగా వ్యవహరించి మొత్తం 5,585 దరఖాస్తులను పరిశీలించింది. ప్రాథమిక పరిశీలన అనంతరం 16 మంది అర్హులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. ఇంటర్వ్యూల తర్వాత ముగ్గురి పేర్లతో కూడిన తుది జాబితాను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సమర్పించారు. ట్రస్ట్ పరిశీలన తర్వాత జితేంద్ర మిశ్ర నియామకం అధికారికంగా ఖరారైంది. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను